For Money

Business News

ఒక షేరకు 4 బోనస్‌ షేర్లు

తమ ఇన్వెస్టర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది బజాజ్‌ ఫైనాన్స్‌. ఇవాళ కంపెనీ త్రైమాసిక ఫలితాలను పరిశీలించేందుకు సమావేశమైన బోర్డు సమావేశం, బోనస్‌తోపాటు షేర్ల విభజనపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న ప్రతి ఒక షేరుకు నాలుగు బోనస్‌ షేర్లు ఇవ్వాలని బజాజ్‌ ఫైనాన్స్‌ నిర్ణయించింది.అలాగే షేర్ల ముఖ విలువను రూ. 2 నుంచి ఒక రూపాయికి తగ్గింది. ఇక ఒక్కో షేర్‌కు రూ. 44 ఫైనల్‌ డివిడెండ్‌ను ప్రకటించింది. అలాగే తన అనుబంధ సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయినందున వచ్చిన లాభం నుంచి ఒక్కో షేరుకు రూ. 12ల ప్రత్యేక డివిడెండ్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించింది.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 4546 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభః 19 శాతం పెరిగింది. పూర్తి ఏడాదికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 16779 కోట్లకు చేరింది. అలాగే ఇపుడు కంపెనీ నియంత్రణలో ఉన్న ఆస్తుల విలు రూ. 4,16,661 కోట్లకు చేరింది. అలాగే కంపెనీ కస్టమర్ల సంఖ్య కూడా 10 కోట్లను దాటింది.