భారత కంపెనీలతో టెస్లా చర్చలు
భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది టెస్లా. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రారాజుగా ఉన్న టెస్లా భారత్‌లో ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు కేంద్రంగా కార్పొరేట్ ఆఫీసు ప్రారంభించిన టెస్లా.. ప్లాంట్ ఎక్కడ పెట్టేది ఇంకా వెల్లడించలేదు. టెస్లా కార్ల కోసం కొన్ని విడిభాగాలను టెస్లా స్థానికంగా సమకూర్చుకునే యోచనలో ఉందని ఎకనామిక్ టైమ్స్ పత్రిక రాసింది. ఇప్పటికే భారత్‌కు చెందిన భారత్ ఫోర్జ్, సోనా BLW, సాంధార్ టెక్నాలజీస్‌తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీలు ఇప్పటికే టెస్లాకు విడిభాగాలు సరఫరా చేస్తున్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్స్, విండ్‌షీల్డ్స్, డిఫరెన్షియల్ గేర్స్, బ్రేక్స్, పవర్ సీట్స్ వంటి విడిభాగాలను టెస్లా భారత్‌లోనే సమకూర్చుకునే ఆలోచనలో ఉంది. ఈ వార్తతో భారత్ ఫోర్జ్, సోనా BLW, సాంధార్ టెక్నాలజీస్ కంపెనీల షేర్ల ధరలు ఇవాళ ఆరు శాతం నుంచి 13 శాతం దాకా పెరిగాయి.