జొమాటోలో సంక్షోభం?

ఉదయం నుంచి బిజినెస్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్. కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి… విజిల్ బ్లోయర్‌గా మారి… సోషల్ మీడియాలో కొన్ని షేర్ చేశాడు. అది రెడిట్‌లో బాగా వైరల్ అయింది. కాస్సేపట్లోనే ఇది బిజినెస్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా స్టార్టప్స్ గురించి మార్కెట్ పెద్దగా సదభిప్రాయం లేకపోవడంతో జొమాటోపై వచ్చిన కామెంట్లు వైరల్‌గా మారాయి. వెంటనే జొమాటొ సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ఇదంతా నాన్ సెన్స్ అంటూ ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు. తమ కంపెనీ మార్కెట్ షేర్ తగ్గలేదని అన్నారు. ఆర్డర్లను తమ ప్లాట్‌ఫామ్‌పైనే చేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు. అయితే విజిల్ బ్లోయర్ చేసిన ఆరోపణలు నమ్మదగ్గవిగా ఉన్నాయంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. జొమాటోలో పరిస్థితి సాధారణంగా లేదని.. కంపెనీ మార్కెట్ వాటా తగ్గుతుండటంతో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొందని విజిల్‌బ్లోయర్ అంటున్నారు. మార్కెట్ షేర్ పడిపోకుండా చూడాలని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కంపెనీ ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈఓ రాకేష్ రంజన్ పేరును ప్రస్తావించారు. స్టే ఆన్ ఫోకస్డ్, గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ వంటి ఆయన ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని రాశారు. అలాగే కంపెనీలో లీడర్ల మధ్య మ్యూజికల్ ఛైర్ పోటీ నడుస్తోందన్నారు. అలాగే ఆఫీస్ పాలిటిక్స్ బాగా పెరిగిపోయాయని అంటున్నారు. ఫుడ్ డెలివరీ ప్యాటర్న్ అంశంలో కంపెనీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని అంటున్నారు. ఎక్కువ సమయం పనిచేయించుకోవడం, తక్కువ జీతం చెల్లించడంతో చాలా మంది డెలివరీ బాయ్స్.. రైడర్స్… మానేస్తున్నారని రాశారు. అలాగే చాలా మంది రైడర్స్ ఫుడ్ పార్సిల్స్ పిక్ చేసిన తరవాత మాయమైపుతున్న ఘటనలు కూడా పెరిగాయని విజిల్ బ్లోయర్ పేర్కొన్నారు. దీంతో ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. దీంతో డెలివరీ outage పెరిగిందని అన్నారను. రెస్టారెంట్లు ఓపెన్‌గా ఉన్నా… ఆర్డర్స్ ఆఫ్ లైన్‌లోకి వెళ్ళిపోతున్నాయిని విజిల్ బ్లోయర్ తెలిపారు.కొన్ని సార్లు ప్యాక్ చేసిన ఆర్డర్లను తీసుకునే వారు కూడా లేరని ఆరోపణలు ఉన్నాయి. దీనికంతటికీ కారణం ఎవరో తెలియడం లేదంటున్నారు. విజిల్ బ్లోయర్ చెబుతున్న ఘటనలు తమకు ఎరుకని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పైగా జొమాటొ మాతృసంస్థ అయిన ఎటర్నల్‌లో ప్రమోటర్ దీపిందర్ గోయల్ కేవలం నాలుగు శాతం వాటా మాత్రమే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.