జెన్‌సోల్ ప్రమోటర్ల అరెస్ట్

నిధుల దుర్వినియోగం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జెన్‌సోల్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రమోటర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ వెల్లడించింది. కంపెనీ ప్రమోటర్లయిన అన్మోల్ సింగ్, పునీత్ సింగ్ జగ్గీలను ఈడీ ఇవాళ అరెస్ట్ చేసింది. జెన్‌సోల్ పేరుతో పీఎఫ్‌సీతో పాటు ఇరేడా సంస్థల నుంచి దాదాపు రూ. 600 కోట్ల రుణం పొందిన ప్రమోటర్లు.. వాటిని సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీలు కొనుగోలు కోసం పొందిన ఈ రుణాలను సొంత కంపెనీలకు తరలించినట్లు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి తేల్చింది. ప్రమోటర్లను స్టాక్ మార్కెట్ నుంచి నిషేధించింది. ప్రమోటర్లపై ఇప్పటికే పీఎఫ్‌సీ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. ఇవాళ ఈడీ రంగంలోకి దిగింది. సెబి చర్యల తరవాత స్టాక్ మార్కెట్‌లో జెన్‌సోల్ ఇంజినీరింగ్ షేర్ ధర 22 శాతంపైగా క్షీణించింది.