For Money

Business News

నాస్‌డాక్‌ 2 శాతం డౌన్‌

చిప్‌ తయారీ కంపెనీ ఎన్‌విడియా వార్నింగ్‌తో ఐటీ, టెక్‌ షేర్లలో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. చైనా ఆంక్షల కారణంగా ఈ సారి తాను 550 కోట్ల డాలర్ల భారాన్ని మోయాల్సి ఉంటుందని ఎన్‌విడియా చెప్పడంతో ఐటీ, టెక్‌ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. తన ఆధునాతన చిప్స్‌ను చైనాకు అమ్మకూడదని బైడెన్‌ సర్కార్‌ ఆదేశించింది. దీనివల్ల తనపై భారీ భారం పడనుందని ఎన్‌విడియా ఇవాళ పేర్కొంది. దీంతో ఈ కంపెనీ షేర్‌ దాదాపు 8 శాతం దాకా క్షీణించింది. ఎన్‌విడియా ఒత్తిడి కారణంగా నాస్‌డాక్‌ ఇపుడు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా 1.24 శాతం నష్టంతో ఉంది. ఇక డౌజోన్స్‌ నష్టాలు కేవలం 0.55 శాతానికి పరిమితమయ్యాయి. మార్చిలో కన్జూమర్‌ గూడ్స్‌ అమ్మకాలు బాగుండటంతో డౌజోన్స్‌లో అమ్మకాల ఒత్తిడి పరిమితంగా ఉంది. మరోవైపు డాలర్‌ ఇవాళ మరింత క్షీణించింది. దాదాపు 0.8 శాతం నష్టంతో డాలర్‌ ఇండెక్స్‌ 99.28 వద్ద ట్రేడవుతోంది.