ట్రంప్‌కు సుప్రీం కోర్టు షాక్

అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID)తో పాటు మానవదృక్పథంతో వివిధ దేశాల్లో ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులకు నిధులు ఆపాలన్న అధ్యక్షుడ ట్రంప్ ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై ఇది వరకే జిల్లా కోర్టు న్యాయామూర్తి అమీర్ అలీ ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు 5-4 మెజారిటీ తీర్పుతో జస్టిస్ అలీ తీర్పును సమర్థించింది. ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయాలని ఆదేశించింది. దీని కింద ట్రంప్ ప్రభుత్వం సుమారు 200 కోట్ల డాలర్లను విడుదల చేయాల్సి ఉంది.