లాభాల స్వీకరణ…
మార్కెట్ ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. మిట్టమధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినా.. ఎంతోసేపు ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. నిఫ్టి 24498 పాయింట్లను తాకింది. మిడ్ సెషన్ తరవాత లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి పడుతూ వచ్చింది. చివరి గంటలో ఒత్తిడి బాగుంది. దీంతో నిఫ్టి 24307 పాయింట్ల స్థాయికి చేరింది. ఆ వెంటనే స్వల్పంగా కోలుకుని 24340 వద్ద 126 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ కూడా 426 పాయింట్ల నష్టంతో ముగిసింది. 80వేల స్థాయిని సెన్సెక్స్ కాపాడులేకపోయింది. బ్యాంక్ నిఫ్టితో పాటు ఫైనాన్షియల్స్‌లో ఇవాళ లాభాల స్వీకరణ కన్పించింది. అయితే ఇవాళ అనేక మిడ్ క్యాప్ షేర్లు అప్పర్ సీలింగ్‌లో ముగిశాయి. ముఖ్యంగా న్యూఏజ్ షేర్లకు గట్టి డిమాండ్ లభిస్తోంది. నిఫ్టిలో ఇవాళ అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్‌తోపాటు హీరోమోటార్స్, టాటా కన్జూమర్ షేర్లు మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి. అలాగే బ్రిటానియా, మారుతీ కూడా టాప్ గెయినర్స్‌లో స్థానం సంపాదించాయి. ఇక నష్టపోయిన వాటిలో సిప్లా టాప్ లూజర్ నిలిచింది. ఈ షేర్ 4 శాతంపైగా నష్టపోయింది. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ట్రెంట్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా రెండు వాతంపైగా నష్టంతో ముగిశాయి.