ప్చ్… ఈ షేర్ దొరకదు
ఉదయం నుంచి పత్రికల్లో ఓ కంపెనీ నుంచి పెద్ద వార్తలు వచ్చాయి. షేర్ ధర ఒక్కసారిగా రూ.3 నుంచి రూ. 2 లక్షలకు పైగా పెరిగినట్లు వార్తల సారంశం. ఈ షేర్ పేరు ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఈ షేర్ ధర మొన్నటి దాకా రూ. 3.53. నిన్న ఒక్కసారిగా 66,92,535 శాతం పెరిగి రూ.2,36,250కు చేరింది. ఆర్బీఐ తాజా నిబందనల మేరకు ఈ షేర్ ధర కోసం ఆక్షన్ నిర్వహించారు. దీంతో కొత్త ధర నిర్ణయించారు. ఇపుడు ఈ షేర్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన షేరుగా మారింది. ఇప్పటి వరకు ఎంఆర్ఎఫ్ పేరుతో ఉన్న రికార్డు ఇపుడు మారింది. ఇది స్మాల్ క్యాప్ ఎన్‌బీఎఫ్‌సీ కాగా. ఈ కంపెనీకి ఎలాంటి వ్యాపారం లేదు. కేవలం ఇతర కంపెనీల్లో పెట్టుబడి పెట్టడమే. అంటే ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ అన్నమాట. ఎల్సిడ్ ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడుల విలువ రూ.11,000 కోట్లు. ఈ షేర్లన్నీ కుటుంబ సభ్యుల వద్దే ఉండటం… దాదాపు లిక్విడిటీ లేని షేర్.