For Money

Business News

168 శాతం పెరిగినా.. ప్చ్‌

గత ఏడాదితో పోలిస్తే ఎంతో ఘనం… క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఢమాల్‌. అనేక కంపెనీల పనితీరు అలానే ఉంది. అలాగే మార్కెట్‌ అంచనాలను చాలా కంపెనీలు అందుకోలేకపోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్‌ చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 168 శాతం పెరిగింది. రూ. రూ.1341 కోట్ల నుంచి నికర లాభం రూ.3593 కోట్లకు చేరింది. అయితే సీఎన్‌బీసీ టీవీ18తో పాటు బ్లూమ్‌బర్గ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్న నికర లాభాన్ని మాత్రం ఆర్జించలేకపోయింది. సీఎన్‌బీసీ టీవీ18 కంపెనీ నికర లాభం రూ. 4,336 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే కంపెనీ రూ. 3593 కోట్లు మాత్రమే ప్రకటించింది. దీనికి మార్కెట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. జులైలో చేపట్టిన టెలికాం టారిఫ్‌ల సవరణ కారణంగా ఎయిర్‌టెల్‌ నికర లాభం భారీగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.37,044 కోట్ల నుంచి రూ.41,473 కోట్లకు చేరింది. ఇందులో ఇతర ఆదాయం రూ.254 కోట్లు కూడా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఒక్కో యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం మాత్రం రూ.203 నుంచి రూ.233కి పెరగడం విశేషం. కంపెనీ మార్జిన్‌ 53 శాతం ఉంటుందని అంచనా వేయగా, కంపెనీ 52.7 శాతం మార్జిన్‌ను ఆర్జించింది.

Leave a Reply