భారీ లాభాల్లో నిఫ్టి
ఆరంభంలో తడబడినా…వెంటనే కోలుకుని ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ట్రేడవుతోంది. ఉదయం 24251 వద్ద ప్రారంభమైన నిఫ్టి ఆ వెంటనే 24134కుపడినా.. వెంటనే కోలుకుంది. పది గంటలకల్లా 24283కు చేరుకుని… 102 పాయింట్ల లాభంతో ట్రేడువుతోంది. ఊహించినట్లు బ్యాంక్ నిఫ్టి ఏకంగా ఒక శాతంగా లాభంతో ట్రేడవుతోంది. ఇక మిడ్ క్యాప్స్‌చాన్నాళ్ళ తరవాత అర శాతం దాకా పెరిగింది. ఫైనాన్షియల్ నిఫ్టి కూడా ఒక శాతం లాభపడింది. నిఫ్టిలో ఇవాళ శ్రీరామ్ ఫైనాన్స్ 4.5 శాతం లాభంతో టాప్ గెయినర్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ మూడు శాతం పైగా లాభపడి రెండో స్థానంలో ఉంది. ఇంకా ఎస్‌బీఐ, హిందాల్కో ఎం అండ్ ఎం టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఫలితాలు దారుణంగా ఉండటంతో కోల్ ఇండియా 5 శాతం దాకా నష్టపోయిన టాప్ లూజర్స్‌లో టాప్‌లో ఉంది. ఇంకా ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, ఎల్ అంట్ టీ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.