కచ్‌లో కాపర్ రిఫైనరీ

మరో కొత్త రంగంలోకి అదానీ గ్రూప్ అడుగుపెడుతోంది. ప్రపంచంలో బాగా డిమాండ్ ఉన్న మెటల్స్‌లో కాపర్ ఒకటి. అదానీ ఎంటర్‌ప్రైజస్ అనుబంధ సంస్థ అయిన కచ్ కాపర్ గుజరాత్‌లో కాపర్ రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది. దీనికి అసవరమైన రాగి ఖనిజాన్నిఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ అత్యధికంగా కాపర్‌ను ఉపయోగిస్తారు. భవిష్యత్తులో ఈ ఖనిజానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 120 కోట్ల డాలర్లతో రిఫైనరీని రెండు దశల్లో నెలకొల్పుతున్నారు. తొలి దశ కింద 50 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో రిఫైనరీని, ఆ తరవాత రెండో దశ పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం 10 లక్షల టన్నులకు చేరుతుందని భావిస్తున్నారు. 2029కల్లా పూర్తి సామర్థ్యంతో ఈ రిఫైనరీ పనిచేస్తుందని అదానీ గ్రూప్ అంచనా.