సగానికి తగ్గిన నికర లాభం
అదానీ గ్రూప్‌నకు చెందిన ఏసీసీ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా సగానికి తగ్గింది. గత ఏడాది రూ. 388 కోట్ల నికర లాభం ప్రకటించగా, ఈసారి రూ. 199 కోట్లను వెల్లడించింది. అంటే 48.5 శాతం మేర తగ్గిందన్నమాట. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కూడా కంపెనీ అదుకోలేకపోయింది. అయితే ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 4 శాతం పెరిగి రూ. 4434 కోట్ల నుంచి రూ. 4613 కోట్లకు చేరింది. ఎబిటా 20 శాతంపైగా తగ్గి రూ. 542 కోట్ల నుంచి రూ. 436 కోట్లకు చేరింది. కంపెనీ మార్జిన్ ఏకంగా 2.9 శాతం క్షీణించి 12.4 శాతం నుంచి 9.5 శాతానికి చేరినట్లు ఏసీసీ పేర్కొంది. కంపెనీ నెట్‌వర్త్ రూ. 16,725 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.