For Money

Business News

రాష్ట్రంలో 5 ఇన్నోవేషన్ హబ్‌లు..

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆంధ్రప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. వీటిలో ప్రధానమైనవాటిల్లో ఒకటి.. అయిదు ఇన్నోవేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం. కేబినెట్‌ సమావేశం తరవాత సీఎం చంద్రబాబు మీడియాకు తాము తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ లేదా గుంటూరు, అనంతపురంలలో ఇతర ఇన్నోవేషన్‌ జోన్లను ఏర్పాటు చేస్తారు. ఇదే సమయంలో నాలెడ్జ్‌ ఎకానమీకి ఏపీ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, దీంతో రాయలసీమ మున్మందు ఫుడ్‌ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతుందన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.

Leave a Reply