For Money

Business News

రిలయన్స్‌ జియో సూపర్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు అంతంత మాత్రమే ఉన్నా… ఆ మాత్రం ఉండటానికి ప్రధాన కారణం రిలయన్స్‌ జియో. ఈ విభాగం సాధించిన అద్భుత ఫలితాలతో కంపెనీ మొత్తమ్మీద ఒక మోస్తరు ఫలితాలతో బయటపడింది. ఇటీవలి కాలంలో టారిఫ్‌ను పెంచడంతో రిలయన్స్‌ జియోకు బాగా కలిసి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే అన్ని విభాగాల్లో జియో రాణించింది. జియో నికర లాభం 23 శాతం పెరిగి రూ. 5,058 కోట్ల నుంచి రూ. 6,231 కోట్లకు చేరింది. అలాగే కంపెనీ టర్నోవర్‌ 14.5 శాతం పెరిగి రూ. 24,750 కోట్ల నుంచి రూ. 28,338 కోట్లకు చేరింది. కంపెనీ ఎబిటా కూడా 16 శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎబిటా రూ. 12953 కోట్లు కాగా, ఈ త్రైమాసికంలో రూ. 15036 కోట్లకు చేరింది. మొత్తం కంపెనీ మార్జిన్ 0.8 శాతం పెరిగి రూ. 52.3 శాతం నుంచి రూ. 53.1 శాతానికి చేరింది.