For Money

Business News

అక్రమంగా రూ. 70,000 కోట్లు తరలింపు

భారతదేశంలో వివో మొబైల్‌ ఫోన్స్‌ను విక్రయించిన వివో చైనా కంపెనీ దిగుమతుల పేరుతో సుమారు రూ. 70,000 కోట్లను విదేశాలకు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరోపించింది. ఈ మేరకు చైనా కంపెనీపై చార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ పేర్కొంది. దేశంలోని 23 రాష్ట్రాల్లో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వివో ఫోన్లను విక్రయించి భారీ మొత్తాన్ని సమీకరించినట్లు ఈడీ వెల్లడించింది. 2014 నుంచి రూ. 70,837 కోట్లను భారత్‌ వెలుపల ఉన్న కంపెనీలకు వినో మొబైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరలించినట్లు పేర్కొంది. బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్‌, సమోవ, హాంగ్‌కాంగ్‌ వంటి దేశాల్లో ఉన్న కంపెనీలకు వివో చైనా తరలించినట్లు ఈడీ ఆరోపణ. భారత్‌లోని కంపెనీలన్నింటిని వివో చైనా కంట్రోల్‌ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టింది. విదేశాల్లో ప్రత్యేక కంపెనీలు నెలకొల్పి వాటి ద్వారా భారత్‌లో వ్యాపారం చేసిందని ఈడీ పేర్కొంది. వివో ఇండియా కంపెనీ హాంగ్‌కాంగ్‌లో ఉన్న మల్లి అకార్డ్‌ లిమిటెడ్‌కు అనుబంధ కంపెనీగా రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే హాంగ్‌ కాంగ్‌ కంపెనీలో వివిధ కంపెనీల ద్వారా చైనా వివోకు వాటాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.

Leave a Reply