For Money

Business News

వాల్‌స్ట్రీట్‌కు జాబ్‌ డేటా బూస్ట్‌

వాల్‌స్ట్రీట్‌ పశ్చిమాసియా యుద్ధాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పూర్తిగా లోకల్‌ డేటాకు స్పందిస్తోంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు తరవాత మార్కెట్‌లో వచ్చిన ర్యాలీ కొనసాగుతూనే ఉంది. పైగా లోకల్‌ డేటా పాజిటివ్‌గా ఉన్న ప్రతిసారీ చాలా పాజిటివ్‌గా స్పందిస్తోంది. సెప్టెంబర్‌ నెలలో కొత్తగా 1.47 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆర్థికవేత్తలు అంచనా వేయగా… తాజా డేటా ప్రకారం ఈ సంఖ్య 2.54 లక్షలకు చేరింది. ఆగస్టు నెలలో కొత్త జాబ్స్‌ డేటా కేవలం 1.59 లక్ష్లలు మాత్రమే. దీనితో స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ట్రేడవుతోంది. ప్రధాన మూడు సూచీలు అర శాతం లాభంతో ఉన్నాయి. జాబ్‌ డేటా చాలా పటిష్ఠంగా ఉండటంతో ఫెడ్‌ మళ్ళీ అర శాతం మేర వడ్డీ తగ్గించే అవకాశాలు తగ్గాయి. దీంతో డాలర్‌ బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ మరో అరశాతం పెరిగినా… క్రూడ్‌ ధరలు నిన్నటి స్థాయిలోనే ఉన్నాయి. స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్‌ పెరగడంతో బులియన్‌ మార్కెట్లు క్రితం స్థాయిల వద్దే ట్రేడవుతున్నాయి. స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Leave a Reply