For Money

Business News

TS: రాష్ట్రం ఏర్పడ్డాక జీడీపీ డబుల్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 7 ఏళ్ళలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రెట్టింపు అయ్యింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా రెట్టింపు అయినట్లు రాష్ట్ర ప్లానింగ్‌ విభాగంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది. ప్రస్తుత ధరలతో లెక్కిస్తే 2014-15లో రాష్ట్ర జీడీపీ రూ. 5,05,849 కోట్లు ఉండగా గత ఏడేళ్ళలో 93.8 శాతం వృద్ధి చెంది రూ.9,80,407 కోట్లకు చేరిందని ఆ సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో భారత జీడీపీ వృద్ధి రేటు 58.4 శాతమేనని పేర్కొంది. జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా కూడా 4.06 శాతం నుంచి 4.97 శాతానికి చేరినట్లు వెల్లడించింది. కరోనా సమయంలో కూడా రాష్ట్ర జీడీపీ వృద్ధి పాజిటివ్‌లోఉంది. 2020-21లో దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 3 శాతం కాగా, తెలంగాణ వృద్ధి రేటు ప్లస్‌ 2.4 శాతం.
2014-15లో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ1,24,104 ఉండగా, 2020-21లో రూ. 2,37,632కు చేరింది. అంటే 91.5 శాతం పెరిగిందన్నమాట.