For Money

Business News

ఆ నాలుగు ఐపీఓలే కీలకం

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి జోరుగా ఉంది. అనేక అనామక కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌ అంటూ వచ్చేస్తున్నాయి. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఒక్క రోజులోనే 13 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయంటే ఐపీఓల క్రేజ్‌ ఎలా ఉందో అర్థమౌతోంది. విక్రమ్‌ సోలార్‌, ఆదిత్య ఇన్ఫోటెక్‌, వరిందేరా కన్‌స్ట్రక్షన్ వంటి కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేశాయి. అయితే ఈ పబ్లిక్‌ ఇష్యూల పరంపరంలో కొన్ని చెత్త కంపెనీలు కూడా వచ్చాయి. కొన్ని మంచి కంపెనీలు కూడా వచ్చాయి. కొన్ని మంచి కంపెనీల పబ్లిక్‌ ఆఫర్లు కూడా నిరాశపర్చాయి. ఆదిత్య బిర్లా క్యాపిటల్, టాటా టెక్‌ వంటి కంపెనీలు ఇప్పటికే పబ్లిక్‌ ఆఫర్‌ ధరను తాకలేకపోయాయి. ఇంకా ఎన్నో అనామక కంపెనీలు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 62 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.64,513 కోట్లను సమీకరించాయి. రాబోయే 2 నెలల్లో మరో రూ.60,000 కోట్లకు పైగా సమీకరించేందుకు పలు కంపెనీలు సిద్ధమౌతున్నాయి. ఇందులో హుందాయ్‌ ఇండియా, ఏథర్‌, స్విగ్గీ, ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జి షేర్లు కూడా ఉన్నాయి. ఈ నాలుగు భిన్న రంగాలకు చెందిన కంపెనీలు కావడం విశేషం. వీటిల్లో హ్యుందాయ్‌ ఏకంగా పాతిక వేల కోట్ల రూపాయల ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇదే జరిగితే దేశంలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ ఇదే అవుతుంది. ఇక స్విగ్గీ కూడా ఏకంగా రూ. 10,500 కోట్ల పబ్లిక్‌ ఆఫర్‌తో రెడీ అవుతోంది. ఇక ఎన్‌టీపీసీ గ్రీన్‌ పబ్లిక్‌ ఆఫర్‌పై ఇప్పటికే ఇన్వెస్టర్లలో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఆఫర్‌తో మాతృసంస్థ ఎన్‌టీపీసీ షేర్‌ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ. 10,000 కోట్ల సమీకరణకు ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది.

Leave a Reply