For Money

Business News

వాల్‌స్ట్రీట్‌లో నాన్‌స్టాప్‌ ర్యాలీ

టెక్‌, ఐటీ షేర్ల మద్దతుతో వాల్‌స్ట్రీట్‌ ఇవాళ కూడా లాభాలతో ట్రేడవుతోంది. మైక్రాన్‌, యాక్సెంచర్‌ ఫలితాలతో ఐటీ, టెక్‌ షేర్ల సూచీనాస్‌డాక్‌ 0.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా 0.5 శాతం లాభాలతో కొత్త శిఖరాలను అధిరోహించింది. ఇక డౌజోన్స్ కూడా అరశాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. ముఖ్యంగా డాలర్‌ బలహీనపడటంతో పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. బులియన్‌ మార్కెట్‌ బంగారం, వెండి దుమ్మురేపుతున్నాయి. ఔన్స్‌ బంగారం ధర 2700 డాలర్లను దాటింది. అలాగే డాలర్‌ తగ్గినపుడల్లా పెరిగే క్రూడ్‌ ఆయిల్ ఇవాళ నాలుగు శాతం దాకా తగ్గింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఒకదశలో 70 డాలర్లను తాకి.. ఇపుడు 71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వీటి ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై కన్పిస్తోంది. ముఖ్యంగా ఆయిల్‌ ఆధారిత కంపెనీలు బాగా రాణిస్తున్నాయి.