కో లొకేషన్ కేసు మూసివేత
హిమాలయాల్లోని ఓ బాబా ఆదేశాల మేరకు దేశ స్టాక్ మార్కెట్ వ్యవహారాలను నడిపారని చెప్పడమేగాక… ఏకంగా అప్పటి ఎన్ఎస్ఈ ఛైర్మన్ కూడా అంగీకరించిన కేసును మూసివేయాలని సెబి నిర్ణయించింది. ఎన్ఎస్ఈ అప్పటి ఛైర్పర్సన్ చిత్రా రామకృష్ణన్‌తో పాటు రవి నారాయణలపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ కేసు మూసివేయాలని సెబి నిర్ణయించింది. ఎన్ఎస్ఈలో సర్వర్లకు సమీపంలోనే కొందరు సర్వర్లను పెట్టుకోవడం ద్వారా వేల కోట్ల రూపాయలను ఆయాచితంగా లబ్ది పొందారని, అప్పటి ఎన్ఎస్ఈ ఉన్నతాధికారులు సహకరించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసింది. స్టాక్ మార్కెట్‌ను కుదిపేసిన ఈ కేసు చివరికి కంచికి చేరడం విశేషం.