లాభాల్లో వాల్‌స్ట్రీట్
ఆరంభ నష్టాల నుంచి వాల్‌స్ట్రీట్ లాభాల్లోకి వచ్చింది. కొద్దిసేపటి క్రితం వచ్చిన పీపీఐ నంబర్లు నిరాశజనకంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ప్రారంభమైంది. పీపీఐ డేటాను చూస్తే… ఫెడరల్ రిజర్వ్ పావు శాతం మేర వడ్డీని తగ్గిస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ అంచనాలకు భిన్నంగా వాల్‌స్ట్రీట్ కొద్దిసేపటికే గ్రీన్‌లో వచ్చింది. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లు రికవరీలో ముందున్నాయి. నిన్న భారీగా పెరిగిన ఎన్‌విడా ఇవాళ కూడా ఒకటిన్నర శాతం లాభపడింది. బ్రాడ్‌కామ్ కూడా నాలుగు శాతంతో ట్రేడవుతోంది. దీంతో నాస్‌డాక్ 0.4 శాతం లాభంతో ఉంది. మరోవైపు యూరో మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. మూడు నెలల్లో యూసీబీ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. ప్రధాన సూచీలు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. 68 డాలర్ల వద్ద బ్రెంట్ క్రూడ్‌కు మద్దతు లభించింది. ఇపుడు 71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే బులియన్ కూడా గ్రీన్‌లో ఉంది. వెండి దాదాపు నాలుగు శాతం దాకా పెరగడం విశేసం. ఔన్స్ బంగారం ధర 2580 డాలర్ల వద్ద ఉంది.