భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
భారీ పతనాన్ని నిన్న మన మార్కెట్లు తప్పించుకున్నాయి. ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా క్రమంగా గుడ్‌బై చెప్పనుందన్న వార్తలతో డాలర్ బాగా బలపడింది. దీంతో మొన్న భారీగా క్షీణించిన అమెరికా మార్కెట్లు…నిన్న స్థిరంగా ముగిశాయి. కాని ఆసియా మార్కెట్లు మాత్రం నిన్న దాదాపు రెండు శాతం దాకా క్షీణించాయి. ఇవాళ కూడా ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్ 1.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి దాదాపు 16,328 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో పోలిస్తే దాదాపు 200 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడవుతోంది. కాబట్టి నిఫ్టి కనీసం ఒక శాతంపైగా నష్టంతో ప్రారంభం కావడం ఖాయంగా కన్పిస్తోంది.