For Money

Business News

పామాయిల్‌కు కనీసం మద్దతు ధర!

పామాయిల్‌ విషయంలో స్వయం సంవృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,040 కోట్లతో ఓ ప్రణాళికను ప్రారంభించింది. ఇక నుంచి ఏటా పామాయిల్‌కు కనీస మద్దతు ధర వంటి వయబిలిటీ ప్రైజ్‌ను ఆఫర్‌ చేస్తుంది. పామాయిల్‌ గెల ( Fresh Fruit Bunches (FFBs)కు ఈ ధర చెల్లిస్తారు. దీని కోసం కేంద్రం ఓ ఫార్ములాను తయారు చేసింది. గత అయిదేళ్ళ ధర ఆధారంగా ఈ ఫార్ములాను తయారు చేస్తారు. అంటే ఏ విధంగానూ రైతు నష్టపోకుండా ఉండేందుకు ఈ ధర ఉంటుంది. ఒకవేళ మార్కెట్‌లో ధర వయబిలిటీ ధరకన్నా దిగువకు వస్తే… వ్యత్యాసాన్ని రైతు ఖాతాకు ప్రభుత్వమే బదిలీ చేస్తుంది.