For Money

Business News

198 కాంట్రాక్టులు రద్దు చేసిన జగన్‌

బుడమేరు ఛానలైజేషన్‌కు సంబంధించిన నాలుగు కాంట్రాక్టలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో జులై 8వ తేదీన దీనికి సంబంధించిన ఉత్తర్వులను జగన్‌ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో223 కాంట్రాక్టు పనులను ప్రారంభించక ముందే క్లోజ్‌ చేయాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టర్లతో మాట్లాడింది. వారు కూడా సరే అనడంతో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను జల వనరుల విభాగం చీఫ్‌ ఎంజినీర్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. వీటిలో 198 ఇరిగేషన్‌ పనులకు సంబంధించిన వర్క్‌ అగ్రిమెంట్లను ప్రీ క్లోజ్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటిలో కృష్ణా డెల్టాకు సంబంధించిన 51 పనులు ఉన్నాయి. తిరుపతి ఎన్‌టీఆర్‌ టీజీపీకి సంబంధించి 25 పనులు, గోదావరి డెల్టాకు సంబంధించిన 24 పనులు ఉన్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి 38 పనులను ప్రారంభించక ముందే రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు టెండర్లు పిలవడంతో పాటు కాంట్రాక్టర్లను ఖరారు చేసి ఉండటంతో… వారితో కూడా ప్రభుత్వం మాట్లాడింది. ఇలా ప్రీ క్లోజ్‌ చేసిన పనుల్లో బుడమేరకు సంబంధించిన నాలుగు పనులు కూడా ఉన్నాయి. ఎనెకెపాడు యూటీకి దిగువన 34వ కిలో మీటర్‌ నుంచి 42.5 కిలో మీటర్‌ వరకు బుడమేరు మేజర్‌ డ్రయిన్‌ ఛానలైజేషన్‌ పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు దక్కింది. దీనితో పాటు 42.5 కి.మీ నుంచి 50.6 కిలో మీటర్‌ వరకు పనులను కూడా ఇదే కాంట్రాక్టర్‌కు దక్కింది. ఈ రెండు పనులకు సంబంధించిన కొంత పనిని గుడివాడకు చెందిన ఎన్‌ఏఎస్‌ బాబు కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చారు. ఈ కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ నాలుగు పనులకు సంబంధించిన టెండర్లను జగన్‌ ప్రభుత్వం ప్రీ క్లోజ్‌ చేసింది.