For Money

Business News

ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాపై 18 శాతం జీఎస్టీ

భూగర్భ జలాలను శుద్ధి చేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తు జీఎస్టీ 18 శాతం కట్టాల్సిందేనని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR)ఆంధ్రప్రదేశ్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఇలా నీటి సరఫరాను స్వచ్ఛంద సంస్థ చేసినా జీఎస్టీ కట్టాల్సిందేనని పేర్కొంది. విజయవాహిని ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ప్రజలకు ఉచితంగా నీటి సరఫరా చేయాలని భావించింది. ఇలా నీరు చేయడం వల్ల పన్ను ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా అని ఏఏఆర్‌ను ఆశ్రయించింది. శుద్ధి చేసిన నీటి సరఫరాపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని, అలాగే మొబైల్‌ యూనిట్ల ద్వారా పంపిణీ చేస్తున్నందున ఆ సేవలపై కూడా 18 శాతం జీఎస్టీ ఉంటుందని ఏఏఆర్‌ స్పష్టం చేసింది. కాంపోజిట్‌ సప్లయ్‌ కాబట్టి ఇలా నీటి సరఫరాపై కూడా జీఎస్టీ కట్టాల్సిందేనని ఏఆర్‌ఆర్‌ స్పష్టం చేసింది. స్వచ్ఛంద సంస్థలకు మినహాయింపు ఉండదని తెలిపింది.