For Money

Business News

యూపీఐ తరహాలో రుణాల పంపిణీ

రుణాలు తీసుకోవడాన్ని సులభం చేయడం కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ULI)ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం యూపీఐ (UPI) ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ ఎలా జరుగుతుందో అదే విధంగా రుణాల జారీ ఉంటుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. గత ఏడాది దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను ఆర్బీఐ ప్రారంభించింది. ఇది విజయం కావడంతో త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవల అందించనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా యూఎల్‌ఐ పనిచేస్తుందని ఆయన చెప్పారు. రుణం పొందేందుకు డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ అవసరం ఉండదని శక్తికాంత దాస్‌ వివరించారు. దీనివ్లల ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రుణాల జారీ వేగవంతం కానుందన్నారు.