నిఫ్టి: దిగువస్థాయిలో అందిన మద్దతు
ఇవాళ టెక్నికల్‌గా నిఫ్టికి 16,460 ప్రాంతంలో అందాల్సిన మద్దతు 16,480 ప్రాంతంలోనే లభించింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన అరగంటకే నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి పలు హెచ్చుతగ్గులకు లోనైనా.. క్లోజింగ్‌కు ముందు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16,589ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 34 పాయింట్ల లాభంతో 16,563 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిఫ్టి గ్రీన్‌లో ముగిసినా.. అధిక శాతం షేర్లు నష్టాల్లో ముగిశాయి. లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టిలో 29 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్ సూచీ కూడా 0.4 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి ఉదయం ఒక మోస్తరు లాభాలతో ఉన్న షేర్లు… క్రమంగా బలపడి మరింత లాభంతో ముగిశాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా స్టీల్ 1,515.30 3.67
బజాజ్ ఫైనాన్స్ 6,363.05 3.35
ఎం అండ్ ఎం 799.25 2.65
బ్రిటానియా 3,668.00 2.47
ఐఓసీ 107.05 2.29
నిఫ్టి టాప్ లూజర్స్
మారుతీ 6,820.35 -2.60
శ్రీ సిమెంట్ 26,000.00 -2.26
ఐషర్ మోటార్స్ 2,490.00 -2.23
పవర్ గ్రిడ్ 181.05 -2.00
బజాజ్ ఆటో 3,750.00 -1.98