రుణాలపై వడ్డీ పెంపు
‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. కొన్ని టర్మ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ను 0.1 శాతం వరకు పెంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అంటే జులై 15 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ పేర్కొంది. ఏడాది కాలవ్యవధి గల రుణాలపై MCLRను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, ఆరు నెలల టర్మ్ రుణాలపై వడ్డీని 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, అలాగే రెండేళ్ల రుణాలకు వడ్డీని 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెంచింది. దీంతో MCLR ఆధారిత రుణాలకు సంబంధించిన ఈఎంఐలు మరింత పెరగనున్నాయి.