For Money

Business News

ఏపీలో బీపీసీఎల్‌కు మోడీ ఓకే?

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 70,000 కోట్ల వ్యయంతో బీపీసీఎల్‌ నిర్మించదలచని రిఫైనరీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బీపీసీఎల్‌ ప్రతినిధి బృందం నిన్న ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది. దాదాపు 5000 ఎకరాల్లో నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు కోసం ఇతర రాష్ట్రాలు పోటీ పడినా… ఏపీలో ప్లాంట్‌ నిర్మానానికి కేంద్రం ఓకే చెప్పింది. నిన్న బీపీసీఎల్‌ ప్రతినిధులు, చంద్రబాబు జరిపిన చర్చల్లో రిఫైనరీకి సంబంధించి పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రిఫైనరీ నెలకొల్పేందుకు శ్రీకాకుళం, బందరుతో పాటు రామాయపట్నం కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో బీపీసీఎల్‌కు సంబంధం కేంద్రం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈనెల 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రిఫైనరీ ఎక్కడ పెట్టేది… బడ్జెట్‌లో ప్రకటించకపోవచ్చని తెలుస్తోంది. ఫీజబులిటీ నివేదిక రావడానికి 90 రోజులు పడుతుందని… ఆ నివేదిక వచ్చిన తరవాతే ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.