For Money

Business News

మరింత వాటా అమ్మండి

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరింత వాటా అమ్మడానికి ఇదే సరైన సమయమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)నివేదిక పేర్కొంది. ఈనెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నివేదికను ముందు పెట్టింది. ప్రస్తుతం బ్యాంకులన్నీ ఆర్థికంగా పటిష్ఠమైనస్థితిలో ున్నాయని… మరింత పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే సరైన సమయమని పేర్కొంది. ఈ మేరకు ‘కేంద్ర బడ్జెట్‌ 2024-25కు ముందుమాట’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరింత వాటా అమ్మాలని సూచించిన ఎస్‌బీఐ… ఐడీబీఐ బ్యాంక్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ గురించి ప్రస్తావించింది. ఈ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ కలిసితో కలిపి ప్రభుత్వానికి 61 శాతం వాటాను విక్రయిస్తోంది. 2022లో ఐడీబీఐ విక్రయానికి బిడ్లు ఆహ్వానించారని, 2023 జనవరిలో వాటాల కొనుగోలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కేంద్రం అందుకున్న అంశాన్ని నివేదికలో ఎస్‌బీఐ ప్రస్తావించింది. అయితే డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ బడ్జెట్‌లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఇంకా పలు ఆర్థిక అంశాలను కూడా నివేదిక ప్రస్తావించింది. 2022-23FYలో కుటుంబాల పొదుపు 5.3 శాతంగా ఉంగా, 2024లో 5.4 శాతానికి చేరొచ్చని ఎస్‌బీఐ అంచనా వేసింది.