For Money

Business News

సూచీలు స్థిరంగా… షేర్లు నష్టాల్లో

మన స్టాక్ మార్కెట్‌ సూచీలు స్థిరంగా ముగిసినట్లు కన్పించినా… మెజారిటీ షేర్లు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభం తరవాత వెంటనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరి పదిహేను నిమిషాలు మాత్రం నామమాత్రపు లాభాల్లో ముగిసింది. కాని అనేక షేర్లు ఒక మోస్తరు నుంచి భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో తీవ్ర ఒత్తిడి కన్పించింది. నిఫ్టిలో కేవలం మూడు పాయింట్ల నష్టం కన్పించినా… మిడ్‌ క్యాప్‌ సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. స్మాల్‌ క్యాప్‌ సూచీ కూడా చాలా వరకు తన లాభాలను కోల్పోయింది. ఇక బ్యాంక్‌ నిఫ్టిలో ప్రైవేట్‌ బ్యాంకుల ఒత్తిడి స్పష్టంగా కన్పించింది. బ్యాంక్‌ నిఫ్టి దాదాపు అర శాతం నష్టపోయింది. నిఫ్టీ 3.30 పాయింట్ల నష్టంతో 24,320 వద్ద స్థిరంగా క్లోజ్‌ కాగా, సెన్సెక్స్‌ 36 పాయింట్ల నష్టంతో 79,960 వద్ద ముగిసింది. నిఫ్టిలో ఓఎన్‌జీసీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హిందుస్థాన్‌ లీవర్‌, విప్రో టాప్‌ గెయినర్స్‌ కాగా, టైటాన్‌,దివీస్‌ ల్యాబ్‌, బీపీసీఎల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఫెడరల్‌ బ్యాంక్‌ ఇవాళ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, వోల్టాస్‌, లుపిన్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌ టాప్‌ ఫైవ్‌లో ఉన్నాయి. ఇక నష్టపోయినవాటిలో ఏయూ బ్యాంక్‌ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల బాగా పెరిగిన పర్సిస్టెన్స్‌, కుమిన్స్‌, ఐడియా, ఆస్ట్రాల్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. చాన్నాళ్ళు బ్యాంక్‌ నిఫ్టికి అండగా నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వరుసగా మూడో సెషన్‌లో నష్టాల్లో ముగిసింది. షేర్‌ ధర రూ. 1636.