కేంద్ర మంత్రుల శాఖలు ఇవే
మోడీ కొత్త కేబినెట్లో కీలక శాఖల్లో పెద్ద మార్పులు లేవు. ప్రధాని మోడీతో పాటు 71 మంది మంత్రుల పోర్టుఫోలియోలను ఇవాళ ప్రకటించారు. ఇందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురు స్వత్రంత్ర మంత్రులు ఉన్నారు. నిర్మల, అమిత్ షా, రాజ్నాథ్తో పాటు పలువురు కీలక మంత్రుల శాఖల్లో మార్పుల్లేవు.
ప్రధాని మోడీ శాఖలు:
సిబ్బంది వ్యవహారాలు, పించన్లు, పబ్లిక్ గ్రీవెన్స్, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలతోపాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు.
కేబినెట్ మంత్రులు
1. అమిత్ షా – హోం మంత్రిత్వ, సహకార శాఖ
2. రాజ్నాథ్ సింగ్ – రక్షణ శాఖ
3. నితిన్ గడ్కరీ – రోడ్లు, నేషనల్ హైవేలు
4. జగత్ ప్రకాశ్ నడ్డా – ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
5. శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి
6. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ; కార్పొరేట్ వ్యవహారాలు
7. జైశంకర్ – విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ ఎల్ ఖట్టర్ – గృహనిర్మాణ, పట్టణభివృద్ధి; విద్యుత్తు
9. హెచ్.డి. కుమారస్వామి – భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూష్ గోయల్ – వాణిజ్య, పరిశ్రమలు
II. ధర్మేంద్ర ప్రధాన్ – విద్య
12. జీతన్ రామ్ మాంఝి – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13. రాజీవ్ రంజన్ సింగ్ – పంచాయతీరాజ్; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
14. సర్బానంద్ సోనోవాల్ – షిప్పింగ్, పోర్టులు, వాటర్ వేస్
15. వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత
16. రామ్మోహన్ నాయుడు – పౌర విమానయానం
17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి – వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజాపంపిణీ; నూతన, పునరుత్పాదక ఇంధనం
18. జుయెల్ ఓరం – గిరిజన వ్యవహారాలు
19. గిరిరాజ్ సింగ్ – జౌళి పరిశ్రమ
20. అశ్వినీ వైష్ణవ్ – రైల్వే, సమాచార – ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
21. జ్యోతిరాదిత్య సింధియా – కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
22. భూపేంద్ర యాదవ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
23. గజేంద్రసింగ్ షెకావత్ – టూరిజం, కల్చరల్
24. అన్నపూర్ణాదేవి – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
25. కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం, సహజవాయువులు
27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ – కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు – యువజన వ్యవహారాలు
28. జీ కిషన్ రెడ్డి – బొగ్గు, గనులు
29. చిరాగ్ పాసవాన్ – ఆహార శుద్ధి పరిశ్రమలు
30. సి.ఆర్.పాటిల్ – జల్ శక్తి
సహాయ మంత్రులు (ఇండిపెండెంట్)..
31. రావ్ ఇంద్రజిత్ సింగ్ – గణాంకాలు, కార్యక్రమాల అమలు, సాంస్కృతిక
32. జితేంద్రసింగ్ – శాస్త్ర సాంకేతిక,, భౌగోళిక శాస్త్ర, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యహారాలు, పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం
33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ – న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు
34. ప్రతాప్ రావ్ గణపత్రావ్ జాదవ్ – ఆయుష్, ఆరోగ్య – కుటుంబ సంక్షేమం
35. జయంత్ చౌధరి – నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్, విద్య
సహాయ మంత్రులు
36. జితిన్ ప్రసాద – వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
37. శ్రీపాద్ యశో నాయక్ – విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం
38. పంకజ్ చౌధరి – ఆర్థికం
39. క్రిషన్ పాల్ – సహకారం
40. రామ్ దాస్ అథవాలే – సామాజిక న్యాయం, సాధికారత
41. రామ్ నాథ్ ఠాకూర్ – వ్యవసాయ, రైతు సంక్షేమం
42. నిత్యానందరాయ్ – హోం
43. అనుప్రియ పటేల్ – ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు
44. వి.సోమన్న – జల్ శక్తి, రైల్వే
45. పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
46. ఎస్.పి.సింగ్ బఘేల్ – మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్
47. శోభా కరంద్లాజే – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
48. కీర్తివర్ధన్ సింగ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ
49. బీఎల్ వర్మ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం – సాధికారత
50. శాంతనూ ఠాకూర్ – పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్
51. సురేష్ గోపి – పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం
52. ఎల్.మురుగన్ – సమాచార – ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
53. అజయ్ టమ్టా – రోడ్డు రవాణా, హైవేలు
54. బండి సంజయ్ కుమార్ – హోం
55. కమలేష్ పాశ్వాన్ – గ్రామీణాభివృద్ధి
56. భగీరథ్ చౌదరి – వ్యవసాయ, రైతు సంక్షేమం
57. సతీశ్ చంద్రదూబే – బొగ్గు, గనులు
58. సంజయ్ సేఠ్ – రక్షణ
59. రవ్నీత్ సింగ్ బిట్టూ – ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు
60. దుర్గాదాస్ ఉయికె – గిరిజన వ్యవహారాలు
61. రక్షా నిఖిల్ ఖడ్సే – యువజన వ్యవహారాలు – క్రీడలు
62. సుఖాంత మజుందార్ – విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
63. సావిత్రి ఠాకుర్ – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
64. టోకన్ సాహు – గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు
65. రాజ్ భూషణ్ చౌదరి – జల్ శక్తి
66. భూపతిరాజు శ్రీనివాస వర్మ – భారీ పరిశ్రమలు, ఉక్కు
67. హర్ష్ మల్హోత్రా – కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా – హైవేలు
68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ
69. మురళీధర్ మొహోల్ – సహకార, పౌర విమానయానం
70. జార్జ్ కురియన్ – మైనారిటీ వ్యవహారాలు, మత్స్య – పశుసంవర్ధక – డెయిరీ
71. పబిత్ర మార్గరీటా – విదేశీ వ్యవహారాలు, టెక్సటైల్స్