విమాన టికెట్ల ధరలు పెరిగాయి
దేశీయంగా విమాన టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలను పౌర విమానయాన శాఖ సవరించింది. దీంతో దేశీయంగా విమానయానం మరింత ప్రియమైంది. టికెట్ల ధరలు 9.83 శాతం నుంచి 12.82 శాతం మేర పెరిగాయి. గత ఏడాది మే 25వ తేదీ నుంచి టికెట్ల ధరలు గరిష్ఠ, కనిష్ఠ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తూ వస్తోంది. 40 నిమిషాల కన్నా తక్కువ ప్రయాణ కేటగిరిలో ఉన్న విమాన చార్జీలను రూ. 2600 నుంచి రూ. 2900లకు పెంచారు. అలాగే గరిష్ఠ ధరనురూ. 8,800లకు పెంచారు. అలా వివిధ కేటగిరీలకు ధరలను నిర్ణయించింది.