స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా, లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిక్కీ స్థిరంగా ఉంది. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా గ్రీన్‌లో ఉన్నాయి. చైనా, హాంగ్‌సెంగ్ సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. కరోనా కారణంగా చైనా ప్రధాన రేవులను మూసేస్తోంది. మరోవైపు రియల్‌ఎస్టేట్‌తో పాటు పలు రంగాలపై చైనా ఆంక్షలు విధిస్తోంది. దీంతో అనేక షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.