లాభాల్లో వాల్‌స్ట్రీట్
ఆరంభం నుంచి ఇవాళ వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ఉంది. ఇవాళ ఉదయం వచ్చిన ద్రవ్యోల్బణ డేటా మార్కెట్ అనుకూలంగా ఉంది. ధరలు పెరిగినా… గత మూడేళ్ళ కనిష్ఠ స్థాయిలో పెరిగాయి. దీంతో జూన్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న నమ్మకం మార్కెట్లో మరింత పెరిగింది. దీంతో మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అత్యధంగా అర శాతంపైగ నాస్డాక్ పెరిగింది. డౌజోన్స్ కేవలం 0.03శాతం పెరగ్గా… ఎస్ అండ్ పీ 500 సూచీ 0.27 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ కూడా 104 ప్రాంతంలో ట్రేడవుతోంది. అలాగే క్రూడ్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 82 డాలర్లపైన ఉంటోంది. బులియన్ ధరల్లో కూడా పెద్ద మార్పు లేదు. ఔన్స్ బంగారం ధర 2055 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.