1:5 నిష్ఫత్తిలో ఐఆర్సీటీసీ షేర్ల విభజన
భారత రైల్వేలకు చెందిన ఐఆర్సీటీసీ కంపెనీ తన షేర్ల ముఖవిలువను విభజించాలని నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువ ఉన్న షేర్లను రూ.2 ముఖ విలువగల షేర్లుగా మార్చనుంది. అంటే ప్రతి ఒక షేరు అయిదు షేర్లుగా మారుతాయన్నమాట. ఆ మేరకు షేర్ ధర కూడా తగ్గుతుంది. అయితే షేర్ల విభజన తరవాత లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి… షేర్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది. అందుకే ఈ ఇవాళ ఈ కంపెనీ షేర్ ఆరు శాతం పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 2,727కు పెరిగింది. నిన్న ఈ షేర్ 5 శాతం పెరిగింది. షేర్ల విభజన అంశాన్ని బోర్డులో చర్చిస్తామని గత నెలలోనే ఐఆర్సీటీసీ వెల్లడించింది. ప్రభుత్వ అనుమతి తరవాత షేర్ల విభజన చేస్తారు.