చరిత్ర సృష్టించిన నిఫ్టి
గత రెండు సెషన్లో వచ్చిన ఐటీ షేర్ల బూమ్‌తో స్టాక్ మార్కెట్ సూచీలు చరిత్ర సృష్టించాయి. నిఫ్టి తొలసారి 22000 స్థాయిని దాటింది. అలాగే బీఎస్ఈ సెన్సెక్స్ 73,000 స్థాయిని దాటింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. గత రెండు సెషన్స్‌లో ఐటీ కంపెనీ షేర్ల నుంచి వచ్చిన లాభాలతో ఇన్వెస్టర్ల సంపద 2,200 కోట్ల డాలర్ల మేర పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3.73 లక్షల కోట్లు పెరిగింది. ఐటీ షేర్లలో విప్రో షేర్ గత రెండు రోజుల్లో 14 శాతం పెరిగింది. అలాగే హెచ్‌సీఎల్ టెక్ షేర్లు కూడా. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కన్పించడంతో పాటు కంపెనీల రెవెన్యూ కూడా పెరిగే అవకాశముందని స్టాక్ మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కూడా దిగువ స్థాయి నుంచి భారీగా పెరిగింది. ఒకదశలో 21963 పాయింట్లను తాకిన నిఫ్టి చివర్లో 22115ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 202 పాయింట్లు లాభపడింది. ఐటీ, మిడ్ క్యాప్‌తో పాటు బ్యాంక్ నిఫ్టిలు భారీ లాభాలతో ముగిశాయి.