For Money

Business News

నికర లాభం 56 శాతం డౌన్‌

రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్స్‌ కంపెనీ నిరాశాజనక పనితీరును కనబర్చింది. డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 56 శాతం క్షీణించి రూ. 294 కోట్లకు చేరింది. అలాగే కన్సాలిడేటెడ్‌ టర్నోవర్‌ కూడా 32 శాతం తగ్గి రూ. 413 కోట్లకు క్షీణించింది. అయితే సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే ఖర్చులు రూ. 71 కోట్ల నుంచి రూ. 99 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే కంపెనీ చెల్లించిన పన్ను కూడా రూ. 86 కోట్ల నుంచి రూ. 88 కోట్లకు చేరింది. డిసెంబర్‌ నెలతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో ఆదాయం రూ. 1294 కోట్ల నికర లాభం ప్రకటించింది.