క్రూడ్ ఉత్పత్తి పెంచండి.. అమెరికా
క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఒపెక్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది. సరఫరా పెంచకుంటే… ఇపుడిపుడే వృద్ధి బాటలోకి వస్తున్న ఆర్థికప్రగతి దెబ్బతింటుందని అమెరికా పేర్కొంది. గత జులైలో సమావేశమైన ఒపెక్ దేశాలు క్రూడ్ ఉత్పత్తి పెంచరాదని నిర్ణయించాయి. తాజాగా అమెరికా విజ్ఞప్తి తరవాత క్రూడ్ ఆయిల్ కాస్త ఒత్తిడి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ 70 డాలర్లకు దిగువకు వచ్చింది. డాలర్ ఇవాళ స్వల్పంగా తగ్గింది. పెరగాల్సిన క్రూడ్ ధరలు తగ్గడానికి కారణం.. ఇవాళ అమెరికా వెల్లడించిన చమురు నిల్వల డేటా కూడా. మార్కెట్ వర్గాలు ఆశించిన స్థాయిలో క్రూడ్ నిల్వలు తగ్గలేదు.