నిఫ్టికి మెటల్స్ అండ
నిఫ్టి ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయిని తాకింది. 16,338 స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే 16,309 స్థాయిని తాకింది. ప్రస్తుతం 44 పాయింట్ల లాభంతో 16,324 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్ల ఓపెనింగ్ నుంచి మెటల్స్ వెలుగులో ఉన్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… నిఫ్టి స్వల్ప లాభాలకే ఒత్తిడి ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గే అవకాశం అధికంగా ఉంది. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ఉన్నా… సూచీలు మాత్రం స్వల్ప లాభాలకే పరిమితం అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టి స్వల్ప లాభంలో ఉన్నా… మిడ్ సెషన్ తరవాత ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఎదుకంటే రాత్రి క్రూడ్ ధరలు 3 శాతం కన్నా అధికంగా పెరగడం, అమెరికా ఫ్యూచర్స్ రెడ్‌లో ఉండటంతో నిఫ్టి అప్‌ట్రెండ్‌కు బ్రేక్ పడుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
హిందాల్కో 441.70 3.45
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 742.50 2.82
టాటా స్టీల్ 1,409.80 2.64
ఓఎన్జీసీ 116.45 1.39 కోల్ ఇండియా 144.10 1.34
నిఫ్టి టాప్ లూజర్స్
టెక్ మహీంద్రా 1,309.55 -1.02 సన్ ఫార్మా 787.85 -0.69
డాక్టర్ రెడ్డీస్ 4,744.70 -0.53
సిప్లా 908.25 -0.48
ఇన్ఫోసిస్ 1,669.55 -0.46