19,500పైన ప్రారంభం కానున్న నిఫ్టి
అమెరికా మార్కెట్ల ఉత్సాహం గిఫ్ట్ నిఫ్టిలో కన్పిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు అంచనాలకు మించి తక్కువగా ఉండటంతో ఈక్విటీ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇప్పట్లో అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవన్న అంచనాలతో నాస్డాక్ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. దీంతో గిఫ్టి నిఫ్టి ప్రస్తుతం 140 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి సోమవారం 19443 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ మన మార్కెట్లకు సెలవు కావడంతో… సోమవారం మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి 82 పాయింట్లు నష్టపోయింది. అయితే అమెరికా మార్కెట్ల ఉత్సాహం నేపథ్యంలో నిఫ్టి 19500పైన ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే ఎల్లుండి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్న నేపథ్యంలో నిఫ్టి లాభాలు చివరి వరకు ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది.19500పైన పటిష్ఠంగా ముగిస్తే మాత్రం… మరో బుల్ రన్ ఖాయంగా కన్పిస్తోంది. అదే జరిగితే నిఫ్టి మళ్ళీ 20,000 దిశగా పయనించవచ్చు.