For Money

Business News

2 శాతంపైగా లాభంతో నాస్‌డాక్‌

అమెరికాలో ద్రవ్యల్బోణ వృద్ధి రేటు మార్కెట్‌ అంచనా కంటే తక్కువగా ఉండటంతో డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ భారీగా తగ్గాయి. అమెరికా కన్జూమర్‌ ప్రైజ్‌ ఇండెక్స్‌ సెప్టెంబర్‌లో 3.7 శాతం ఉండగా, అక్టోబర్‌లో ఈ రేటు 3.3 శాతం ఉంటుందని మార్కెట్‌ అంచనా వేసింది. అయితే ఈ రేటు 3.2 శాతానికి పడటంతో డాలర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇప్పట్లో వడ్డీ రేట్లను ఫెడరల్‌ రిజర్వ్‌ పెంచకపోవచ్చనే వార్తలతో బాండ్‌ ఈల్డ్స్‌ భారీగా తగ్గాయి. పదేళ్ళ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ నాలుగు శాతం దాకా క్షీణించాయి. డాలర్‌ ఇండెక్స్‌ ఒక శాతం తగ్గింది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో ఈక్విటీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ ఏకంగా రెండు శాతం పైగా లాభంతో ట్రేడవుతుండగా… ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.89 శాతం లాభంతో ట్రేడవుతోంది. డౌజోన్స్‌ కూడా 1.2 శాతంపైగా లాభంతో ఉంది. డాలర్‌ క్షీణించడంతో వెంటనే బులియన్‌, క్రూడ్‌ ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఏకంగా 84 డాలర్లకు చేరగా, ఔన్స్‌ బంగారం ధర అమెరికాలో 1971 డాలర్లకు చేరింది.