స్థిరంగా ముగిసిన నిఫ్టి
ప్రపంచ మార్కెట్లన్నీ అమెరికా ఫెడ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే ఈ వారంలో గూగుల్, మెటాతో సహా మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో పెద్దగా కదలికలు లేవు. అయితే ఉదయం మాత్రం చైనా, హాంగ్‌సెంగ్ మార్కెట్లు చెలరేగిపోయాయి. చైనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడంతో ఆ దేశ మార్కెట్లు రెండు శాతం నుంచి మూడు శాతం దాకా పెరిగాయి. ఇక హాంగ్‌సెంగ్ నాలుగు శాతంపైగా లాభంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు స్తబ్దుగా ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 8 పాయింట్ల లాభంతో 19680 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల్లో ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్నా… సూచీలు నిలకడగా ముగిశాయి. ఇక షేర్ల విషయానికొస్తే చైనా మార్కెట్లకు స్పందిస్తూ మెటల్ షేర్లు భారీగా పెరిగాయి. హిందాల్కో, జేఏఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు మూడు శాతం నుంచి నాలుగు శాతం వరకు లాభాలతో ముగిశాయి. క్రూడ్ ధరలు బాగా పెరగడంతో ఏషియన్ పెయింట్స్ 4 శాతంపైగా నష్టపోయింది. ఇక డీమర్జర్ ప్రతిపాదన కారణంగా ఇవాళ కూడా ఐటీసీ రెండు శాతంపైగా నష్టంతో క్లోజైంది. అదానీ గ్రీన్ 10 శాతం సీలింగ్‌తో క్లోజ్ కాగా, అదానీ ట్రాన్స్మిషన్ 8 శాతంపైగా లాభపడింది. అదానీ టోటల్, అదానీ విల్మర్ షేర్లు అయిదు శాతం మేర పెరిగాయి.