For Money

Business News

టాప్‌గేర్‌లో టాటా మోటార్స్‌ లాభాలు

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతంగా రాణించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 3203 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 5007 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 2412 కోట్ల నికర లాభాన్ని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. మార్కెట్‌ అంచనాలకు మించి ఫలితాలను టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇతర అంశాల్లో కూడా కంపెనీ బాగా రాణించింది. కంపెనీ టర్నోవర్‌ లక్ష కోట్లను దాటి రూ. 1.02 లక్షల కోట్లకు చేరింది. ఎబిటా గత ఏడాదితో పోలిస్తే అయిదు రెట్లు పెరిగి రూ. 13218 కోట్లకు చేరింది. జాగ్వర్‌ అమ్మకాలు బ్రహ్మాండంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అలాగే దేశీయ మార్కెట్‌లో వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా బాగున్నాయి. కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ ఏకంగా 7 శాతం పెరిగి 14.4 శాతానికి చేరడం విశేషం.