జులై 13న హెచ్డీఎఫ్సీ షేర్ల డీలిస్టింగ్
జులై 13వ తేదీన హెచ్డీఎఫ్సీ షేర్లను డీలిస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విలీనం జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఈ రెండు కంపెనీలో బోర్డులో జూన్ 30వ తేదీ ట్రేడింగ్ తరవాత భేటీ అవుతాయని ఆయన తెలిపారు. 60 ఏళ్ళలోపు ఉన్న హెచ్డీఎఫ్సీ ఉద్యోగులను విలీన సంస్థలో తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్ 4వ తేదీన ఈ రెండు కంపెనీలు విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విలీనం తరవాత హెచ్డీఎఫ్సీ వాటాదారులకు తమ వద్ద ఉన్న ప్రతి 25 షేర్లకు 42 మెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లభిస్తాయి. విలీనం తరవాత ప్రపంచంలోని టాప్ టెన్ బ్యాంకుల్లో ఒకటిగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మారనుంది.