For Money

Business News

రేపు హెచ్‌ఎంఏ షేర్ల అలాట్‌మెంట్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు దినం మార్చడంతో హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఐపీఓ షేర్ల అలాట్‌మెంట్‌ తేదీ కూడా మారింది. బక్రీద్‌ సెలవును రేపు నుంచి ఎల్లుండి ఎక్స్ఛేంజీలు మార్చాయి. వాస్తవానికి హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ షేర్ల అలాట్‌మెంట్‌ ఈ నెల 29న చేయాల్సి ఉండగా, కంపెనీ ఈ తేదీని రేపటికి ముందుకి జరిపింది. అలాగే ప్రస్తుతం ఐడియా ఫోర్జ్‌ టెక్నాలజీ ఐపీఓ నడుస్తోంది. డ్రోన్‌ తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓ ఈనెల 29న ముగియనుంది. సెలవు మార్పు కారణంగా ఐపీఓ రేపే ముగుస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కంపెనీ షేర్లను రూ. 638-రూ. 672ల శ్రేణితో షేర్లను ఆఫర్‌ చేస్తోంది.