For Money

Business News

చిత్తూరు జిల్లాలో బంగారం తవ్వకాలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ చిత్తూరు జిల్లాలో బంగారం గనుల తవ్వకానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతోందని తెలిసింది. చిత్తూరు జిల్లాలో కుప్పంతో పాటు తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో బంగారు గనులు ఉన్నాయి. ఇందులో కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలోని ‘చిగర్‌గుంట- బిసనత్తమ్‌’ బంగారం గని కూడా ఇందులో ఒకటి. ఈ గనిలో 18 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉందని, ఇందులో తవ్విన ఒక్కో టన్ను ఖనిజం నుంచి 5 గ్రాములకు పైగానే బంగారం లభిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇక్క తవ్వకాలు చేపట్టేందుకు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని ఎన్‌ఎండీసీ నిర్ణయించింది. ‘చిగర్‌గుంట- బిసనత్తమ్‌’ బంగారం గనిలో తవ్వకాలు నిర్వహించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఎన్‌ఎండీసీ ఒప్పందం చేసుకుంది. కుప్పం దగ్గర్లోనే కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా బంగారం గనులను తవ్వుతున్నారు.