గోధుమల నిల్వలపై ఆంక్షలు
నిత్యావసర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. దేశంలోకి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నా… వివిధ రకాల ఆహార ధాన్యాలపై ఆంక్షలు విధిస్తోంది. తాజాగాగోధుమల నిల్వలపై ఇవాళ పరిమితులు విధించింది. రీటైల్ షాపుల్లో పది టన్నులకు మించి గోధుమలు నిల్వ ఉండరాదని స్పష్టం చేసింది. అలాగే పెద్ద చైన్ రీటైలర్ల వద్ద 3000 టన్నులకు మంచి నిల్వలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే హోల్ సేలర్ల వద్ద కూడా ఏ సమయంలోనూ 3000 టన్నులకు మించి గోధుమల ఉండరాదని కేంద్రం స్పష్టం చేసింది. తాజా నిబంధనలను నెల రోజుల్లో చేయాల్సి ఉంటుంది.
గోధమల ఎగుమతులపై ఇది వరకే విధించిన నిషేధం కొనసాగుతుందని కేంద్రం పేర్కొంది. ధరలు పెరగకుండా కంది, పెసర పప్పు నిల్వలపై కేంద్రం ఇది వరకే పరిమితులు విధించింది.