For Money

Business News

రెండేళ్ళ కనిష్ఠానికి CPI

రీటైల్‌ ద్రవ్యోల్బణం రెండేళ్ళ కనిష్ఠానికి క్షీణించింది. మే నెలలో వినియోగ ధరల ఆధారిత రీటైల్‌ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌ నెలలో ఇదే ద్రవ్యోల్బణం 4.7 శాతం. కేంద్ర గణాంక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆహార ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ 3.84 శాతం ఉండగా, మే నెలలో 2.91 శాతానికి పడిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.17 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 4.27 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు మే నెలలో 8.1 శాతం క్షీణించడం విశేషం. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం కూడా 13.67 శాతం నుంచి 12.65 శాతానికి తగ్గింది.