For Money

Business News

18600 స్థాయిని కాపాడుకున్న నిఫ్టి

మార్కెట్‌ ఆరంభంలో అమ్మకాల ఒత్తిడికి గురైనా… యూరో మార్కెట్ల ఉత్సాహంతో కోలుకుంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… ఆరంభంలో నిఫ్టి స్వల్ప లాభాలను సాధించింది. అయితే ఆరంభమైన గంటలోనే అమ్మకాల ఒత్తిడికి గురైంది. నిఫ్టి ఒకదశలో 18559ని స్థాయిని తాకినా.. వెంటనే కోలుకుంది. మిడ్‌ సెషన్‌లో అంటే యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందు మళ్ళీ ఒత్తిడికి లోనైంది. ఆ తరవాత యూరో మార్కెట్లకు అనుగుణంగా బలపడింది. నిఫ్టి 38 పాయింట్ల లాభంతో 18601 పాయింట్ల వద్ద క్లోజ్‌ కాగా, సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడింది. ఇవాళ నిఫ్టి షేర్లలో బీపీసీఎల్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కొన్ని బ్లూచిప్‌ ఐటీ షేర్లు కూడా లాభాలతో ముగిశాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో పవర్‌గ్రిడ్‌ ముందుంది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి స్థిరంగా ముగిసినా… అసలు ట్రేడింగ్‌ అంతా మిడ్‌ క్యాప్‌లో సాగింది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా పరవాలేదు.